జూబ్లీహిల్స్ బరిలో దిగే అభ్యర్థి పేరును కాంగ్రెస పార్టీ ప్రకటించింది. నవీన్ యాదవ్‌కు హస్తం పార్టీ టికెట్ కేటాయించింది. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కే అవకాశం ఇచ్చింది.. ఇక, నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. ఇప్పుడు టికెట్ దక్కించుకున్నారు.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంతి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ఎంఐఎం, టీడీపీ ప్రకటించగా.. బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది.