Cooking Gas Price: వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచిన ఆయిల్ కంపెనీలు..
Cooking Gas Price: పెట్రోల్,డీజిల్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు...సామాన్యుడిపై మరో భారాన్ని మోపాయి.;
Cooking Gas Price: పెట్రోల్,డీజిల్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు...సామాన్యుడిపై మరో భారాన్ని మోపాయి. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలకుపైగా పెంచాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి.చివరిసారిగా గత సంవత్సరం అక్టోబర్ 6న సిలిండర్ ధరలు పెంచాయి చమురు కంపెనీలు. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో సిలిండర్ ధర 950 రూపాయలకు పెరిగింది. కోల్‌కతాలో 976 రూపాయలు, చెన్నైలో 965 రూపాయలు, పట్నాలో వెయ్యి రూపాయలు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటింది. హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్ ధర 1002 రూపాయలకు చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిపు, రష్యా-ఉక్రెయిన్ సంకోభం నేపథ్యంలో పెట్రోల్,డీజిల్ సహా సిలిండర్ ధరలు పెంచినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.