తెలంగాణలో ప్రజలందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్..!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించింది.;
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించింది.. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది.. ఇందు కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. అయితే, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నాక అధికారులతో సమీక్ష జరుపుతానని, వ్యాక్సినేషన్ ని స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు.