CPI Narayana : బిర్యానీ తిని కల్లు తాగి పోండి : సీపీఐ నారాయణ
CPI Narayana : సెప్టెంబర్ 17 విషయంలో సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.;
CPI Narayana : సెప్టెంబర్ 17 విషయంలో సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను తప్పుబట్టారు. ఎంఐఎంకు భయపడే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకొని 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలన్నారు.
అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధమే లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఆగ్రనేతల వరుస పర్యటనలపై తనదైన శైలిలో స్పందించిన నారాయణ.. బిర్యానీ తిని, కల్లు తాగి వెళ్లండని చురకలంటించారు.