నేటి నుంచి దూరదర్శన్‌లో డిజిటల్ తరగతులు ప్రారంభం
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది..;
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌లో బోధనను అందుబాటులోకి తెచ్చేందుకు ఆగస్టు 27 నుంచి టీచర్లు విధులకు హాజరవుతున్నారు. టీవీలు ఉన్న, టీవీలు లేని విద్యార్థులను విభజించారు. టీవీ లు లేని విద్యార్థుల కోసం స్కూల్ పాయిం ట్స్, గ్రామాలవారీగా ప్రత్యామ్నాయ మార్గా లు చూపించారు. రాష్ట్రంలో దాదాపు 92% మంది ఇండ్లలో టీవీలు ఉన్నాయని విద్యాశాఖ సర్వేలో తేలింది. టీవీలు లేని 8% మందికి పాఠాలు బోధించేందుకు ప్రత్యామ్నాయ వేదికలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ పాఠాలపై విద్యాశాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇవాళ ఉదయం నుంచి దూరదర్శన్‌లో డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయి. రామంతపూర్‌లోని దూరదర్శన్ కేంద్రం లో డిజిటల్ బోధన ప్రసారాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు.
మూడు నుంచి 10వ తరగతి విద్యార్థులకు టీవీల్లో ఆన్‌లైన్ క్లాసుల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజు లు తరగతులవారీగా నిర్దేశిత సమయంలో పాఠాలు ప్రసారం కానున్నాయి. టీసాట్ లో తొలి రోజు 10 కాస్లులు, మిగిలిన రోజులు 12 క్లాసులు నడవనున్నాయి. అటు నిర్ణీత సమయంలో పాఠ్యాంశం మిస్ అయిన వారికోసం టీసాట్, యూట్యూబ్ ద్వారా కూడా అందుబాటులో ఉంచుతున్నారు.