Eatela Rajender : తెలంగాణకు కేసీఆర్‌‌కు ఉన్న బంధం తెగిపోయింది : ఈటెల రాజేందర్

Eatela Rajender : కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తున్నాయి;

Update: 2022-10-05 10:15 GMT

Eatela Rajender : కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తున్నాయి.. కేసీఆర్‌ కొత్త పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు.. బీఆర్‌ఎస్‌ ప్రకటనతో తెలంగాణకు, కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు.. ఉద్యమ పార్టీని మట్టిలో కలిపేసి ఉద్యమకారులను మరచిపోయేట్టు చేసి కేసీఆర్‌ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని ఆయన విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణీ చేయాలని పగటి కలలు కంటున్నారంటూ ఈటల రాజేందర్‌ ఫైరయ్యారు. అది కలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News