TS Schools Reopen : తెలంగాణలో విద్యాసంస్థల రీ ఓపెన్ అప్పుడే..!
TS Schools Reopen : తెలంగాణలో విద్యాసంస్థలు ఫిబ్రవరి 1న రీఓపెన్ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం.;
TS Schools Reopen : తెలంగాణలో విద్యాసంస్థలు ఫిబ్రవరి 1న రీఓపెన్ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. కరోనా కారణంగా పొడిగించిన సెలవులు ఎల్లుండితో ముగియనున్నాయి. ఇక.. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే 8, 9, 10వ తరగతులకు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిలో చాలా మంది టీకా పొందారు. జ్వర సర్వే కూడా పూర్తవడంతో కరోనా వ్యాప్తి తీరును ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ అంశాలన్నిటి ఆధారంగా సెలవులపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనుంది. కరోనా, ఒమిక్రాన్ కేసులతో ఈనెల 8న విద్యా సంస్థలు మూసేసింది ప్రభుత్వం. అప్పటి నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత పొడిగించారు. ఈ సెలవులు ఎల్లుండితో ముగియనున్నాయి.