REVANTH:తెలంగాణ అభివృద్ధి కోసం ఎవర్నైనా కలుస్తా

ఉమ్మడి అదిలాబాద్‌లో సీఎం రేవంత్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన.. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం షురూ.. ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్ తెస్తామన్న రేవంత్

Update: 2026-01-17 03:15 GMT

పాలమూరు జిల్లాతో సమానాంగా ఆదిలాబాద్‌ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

‘‘ని­ర్మ­ల్‌ ప్ర­జ­లు ఇచ్చిన భరో­సా, మద్ద­తు వల్లే సీఎం అయ్యా­ను. ఆది­లా­బా­ద్‌ జి­ల్లా పో­రా­టా­ని­కి, పౌ­రు­షా­ని­కి గడ్డ. జల్‌, జం­గ­ల్‌, జీ­మీ­న్‌ అంటూ కు­ము­రం భీం కొ­ట్లా­డా­రు. ఈ జి­ల్లా­లో జర­గా­ల్సి­నంత అభి­వృ­ద్ధి జర­గ­లే­దు. బాసర ట్రి­పు­ల్‌ ఐటీ­లో­నే యూ­ని­వ­ర్సి­టీ ఏర్పా­టు చే­స్తాం. జి­ల్లా­లో­ని ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లం­తా ఇం­దు­కు సహ­క­రిం­చా­లి.జి­ల్లా­కు ఎయి­ర్‌ బస్‌ తీ­సు­కొ­స్తాం. ఎయి­ర్‌­పో­ర్టు కోసం 10వేల ఎక­రాల భూ­మి­ని సే­క­రిం­చా­లి. వి­మా­నా­శ్ర­యం ప్రా­రం­భో­త్స­వా­ని­కి ప్ర­ధా­ని మో­దీ­ని ఆహ్వా­ని­ద్దాం. తు­మ్మి­డి­హ­ట్టి వద్ద ప్రా­జె­క్టు కట్టా­ల్సిం­దే.. మో­దీ­ని పదే పదే కలు­స్తు­న్నా­న­ని కొంత మంది వి­మ­ర్శి­స్తు­న్నా­రు. రా­ష్ట్రా­ని­కి ని­ధు­లు, ప్రా­జె­క్టు­లు ఎవరు ఇస్తా­రు.. ప్ర­ధా­ని కాదా? ప్ర­ధా­ని­ని కల­వ­క­పో­తే ని­ధు­లు, ప్రా­జె­క్టు­లు ఎలా వస్తా­యి. పదే­ళ్ల పాటు కేం­ద్ర ప్ర­భు­త్వా­న్ని గత ప్ర­భు­త్వం అడ­గ­లే­దు. అడ­గ­క­పో­తే రా­ష్ట్రా­ని­కి ఏం కా­వా­లో కేం­ద్రా­ని­కి ఎలా తె­లు­స్తుం­ది. పై­ర­వీ­లు చే­య­ను.. పర్స­న­ల్‌ ఎం­జె­డా లేదు.. రా­ష్ట్ర అభి­వృ­ధ్ధి కోసం, ని­ధుల కోసం.. ప్ర­ధా­ని మోదీ, అమి­త్‌ షా సహా ఎవ­రి­నై­నా కలు­స్తా. ఎన్ని­క­లు వచ్చి­న­ప్పు­డే రా­జ­కీ­యా­లు.. ఆ తర్వాత అభి­వృ­ద్ధే అం­ద­రి లక్ష్యం. పదే­ళ్లు అధి­కా­రం­లో ఉన్న వారు ఈ ఆలో­చన చే­య­క­పో­వ­డం వల్లే.. తె­లం­గా­ణ­కు తీ­ర­ని నష్టం జరి­గిం­ది." అని రేవంత్ అన్నారు.

నీటిని ఒడిసిపడతాం

ప్ర­తి నీటి చు­క్క­ని ఓడి పట్టు­తా­మ­న్నా­రు.. ఆది­లా­బా­ద్‌­కు ఎయి­ర్ పో­ర్ట్ తీ­సు­కొ­చ్చే బా­ధ్యత తన­ద­ని హామీ ఇచ్చా­రు. మోడీ చే­తుల మీ­దు­గా ఆది­లా­బా­ద్ ఎయి­ర్ పో­ర్టు శి­లా­ఫ­ల­కం వే­యి­స్తా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. ఎన్ని­క­లు వచ్చాక రా­జ­కీ­యం.. ఎన్ని­కల తర్వాత అభి­వృ­ద్ధి­కి కలి­సి నడు­ద్దా­మ­న్నా­రు. ప్ర­తి మూడు నె­ల­ల­కు సారి కేం­ద్రా­న్ని కలు­స్తాం.. మీరు సైతం నా దగ్గ­ర­కు రండి.. సా­ధ్యం అయి­నంత పను­లు చే­స్తా­మ­ని ప్ర­తి­ప­క్ష నే­త­ల­కు సీఎం తె­లి­పా­రు. మోడీ నాకు చు­ట్టం కాదు దే­శా­ని­కి ప్ర­ధా­ని కా­బ­ట్టి మన ప్రాం­తం అభి­వృ­ద్ధి కా­వా­లి కా­బ­ట్టి మో­డీ­ని కలు­స్తు­న్నా­న­ని చె­ప్పా­రు. ప్రాంత అభి­వృ­ద్ధి కోసం ఎవ్వై­ర్ని­నా కలు­స్తా. పై­ర­వీ­లు లేవు, పర్స­న­ల్ పను­లు నాకు లే­వ­ని సీఎం స్ప­ష్టం చే­శా­రు. నిర్మల్‌ జిల్లాకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ మంజూరు చేస్తున్నాం. నాగోబా జాతరకు రూ.22కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.300 కోట్లు కేటాయించి పునర్నిర్మాణం చేశాం. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామంగా మారింది. పెట్టుబడుల కోసం మేం ప్రయత్నిస్తుంటే.. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించి రూ.8లక్షల కోట్లు అప్పు చేశారు.. రూ. వేల కోట్లు దోపిడీ చేశారు’’ అని సీఎం అన్నారు.

Tags:    

Similar News