మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ ఇక లేరు..!

కాంగెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Update: 2021-04-27 05:15 GMT

కాంగెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణరావుకి కరోనా సోకడంతో ఆయనను వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు ఆయన కుటుంబ సభ్యులు.. అక్కడ డాక్టర్లు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ అయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

విలక్షణమైన నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెస్సార్‌కు మంచి గుర్తింపు ఉంది. 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక 1971లో తెలంగాణ ప్రజాసమితి తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2000-2004 మధ్య పీసీసీ అధ్యక్షుడిగా, 2004 నుంచి 2007 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఇక 2006లో గులాబీ అధినేత.. కేసీఆర్‌ను సవాల్‌ చేసి కరీంనగర్‌ ఉపఎన్నికకు కారణమయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేసీఆర్‌ గెలవడంతో ఆ తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Tags:    

Similar News