Hyderabad: నిజాంపేటలో గాంధీ విగ్రహం ధ్వంసం
అంంబి చెరువుపై ఉన్న గాంధీ విగ్రహం తల.. మొండెం వేరు చేసి;
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ప్రగతి నగర్ లోని ఆరవ డివిజన్లో నవంబర్ 4 అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. తల,మొండెం వేరు చేశారు. తెల్లవారుజామున ఈ సంఘటనను కాలనీవాసులు చూశారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇక, గాంధీ జయంతి రోజున హడావిడిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు.. చెరువుకట్టపై మందుబాబులు చేసిన ఘనకార్యం అని వాకర్స్ ఆరోపిస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.