KTR Kumaraswamy : హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామి.. జాతీయ రాజకీయాలపై చర్చ..
KTR Kumaraswamy : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు;
KTR Kumaraswamy : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి....మాజీ ప్రధాని దేవేగౌడ, కుమారస్వామితో చర్చించారు. ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కేసీఆర్ కుమారస్వామి...భేటీ కానున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్...ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. బీజేపీని గద్దె దించేందుకు కలిసి రావాలని వివిధ పార్టీ నేతలను కోరారు.