KCR : బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
KCR : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు;
KCR : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కుమ్రం భీమ్ ఆదివాసీ, సంత్ సేవాలాల్ బంజారా భవనాలను 50 కోట్ల నిధులతో ప్రభుత్వం నిర్మించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా బంజారా, ఆదివాసీ భవన్‌లు నిర్మించుకునట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ ప్రతీకలుగా ఈ భవనాలు నిలుస్తాయన్నారు.. ఆదివాసీలు, గిరిజనుల హక్కుల పరిరక్షణ వేదికలుగా వెలుగొందుతాయన్న ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. పోడు భూములు సహా పలు సమస్యల పరిష్కారం పరిష్కరించుకుందామన్నారు.