KCR: కాసేపట్లో తమిళనాడుకు సీఎం కేసీర్.. ఎమ్‌కే స్టాలిన్‌తో సమావేశమయ్యే అవకాశం..
KCR: సీఎం కేసీఆర్ కాసేపట్లో తమిళనాడు పర్యటనకు బయల్దేరనున్నారు.;
KCR: సీఎం కేసీఆర్ కాసేపట్లో తమిళనాడు పర్యటనకు బయల్దేరనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్నారు. రేపు సీఎం స్టాలిన్‌తో పాటు, తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్‌ను కలిసే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
కేసీఆర్.. ప్రత్యేక విమానంలో తిరుచిరాపల్లి వెళ్లనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి రంగనాథస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి చెన్నై చేరుకొని రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. కేంద్రం వైఖరి, రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
బియ్యం సేకరణ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ ధోరణిని ఎండగట్టడంతో పాటు.. పంటలకు మద్దతు ధరలపై విధాన నిర్ణయాన్ని వెల్లడించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఇతర రాజకీయ పార్టీల మద్దతు సమీకరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. అటు.. మార్చి 28న జరగనున్న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకూ ఆహ్వానించనున్నారు.