Komatireddy Raj Gopal Reddy: బీజేపీలో చేరుతారన్న వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి..

Komatireddy Raj Gopal Reddy: బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి.

Update: 2022-07-24 08:55 GMT

Komatireddy Raj Gopal Reddy: బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు మమునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో మర్యాద పూర్వకంగానే కలిశానన్నారు. అమిత్ షాను కలవడం కొత్త కాదని.. అనేక సార్లు కలిసినట్లు చెప్పారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షాతో భేటీ కావడం అందరి సమక్షంలోనే జరిగినట్లు వివరించారు.

కాంగ్రెస్‌తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతి, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నానని చెప్పారు. పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఈ ప్రచారంపై కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎలాంటి గందరగోళానికి గురికావొద్దన్నారు.

పార్టీ వీడే పరిస్థితి వస్తే భువనగిరి,మునుగోడు నియోజకవర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని,తాను రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తున్నందన్న ప్రచారం చేస్తున్నారని అన్నారు రాజ్‌ గోపాల్‌ రెడ్డి.

ఇదంతా కేసీఆర్‌ ఆడుతున్న నాటకమని నన్ను చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని అందుకే ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు..తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన మాట వాస్తవమేనని,తాను బహిరంగంగానే కలిశానని తెలిపారు..తన నియోజకవర్గంలో అర్హులందరికి దళితబంధు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మళ్లీ పోటీ చేయనని అన్నారు. తెలంగాణలో రాచరికపు పాలన సాగుతుందని విమర్శించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

Tags:    

Similar News