LOCALBODY ELECTIONS: స్థానిక సంస్థల ఎన్నికలు..మూడు మార్గాలు

రేవంత్ సర్కార్ భవిష్యత్తు కార్యాచరణపై ఉత్కంఠ

Update: 2025-10-11 06:30 GMT

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తూ తె­లం­గాణ సర్కా­ర్ జారీ చే­సిన జీవో నెం­బ­ర్ 9 అమ­లు­పై హై­కో­ర్టు మధ్యం­తర స్టే వి­ధిం­చ­డం సరి­కొ­త్త చర్చ­కు దారి తీ­శా­యి. బీ­సీ­ల­కు 42%  రి­జ­ర్వే­ష­న్లు కే­టా­యి­స్తూ.. ప్ర­భు­త్వం జారీ చే­సిన జీవో  నం­బ­ర్ 9కి వ్య­తి­రే­కం­గా దా­ఖ­లైన పి­టి­ష­న్ల­పై రెం­డు రో­జుల పాటు వా­ద­న­లు వి­న్న హై­కో­ర్టు తుది ని­ర్ణ­యం వె­ల్ల­డిం­చిం­ది. దీని ప్ర­కా­రం జీవో 9 పై స్టే వి­ధిం­చిం­ది. దీం­తో, స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ప్ర­క్రియ ని­లి­చి­పో­యిం­ది. ఈ మే­ర­కు రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం కూడా ఒక ప్ర­క­టన వి­డు­దల చే­సిం­ది. కో­ర్టు ఆదే­శా­ల­ను అమలు చే­స్తా­మ­ని ఆ ప్ర­క­ట­న­లో పే­ర్కొం­ది. జీవో నెం­బ­ర్ 9పై హై­కో­ర్టు మధ్యం­తర స్టే వి­ధిం­చ­డం­తో, ఇప్పు­డు తె­లం­గాణ ప్ర­భు­త్వం ముం­దు మూడు ప్ర­ధాన ఆప్ష­న్స్ ఉన్నా­యి. హై­కో­ర్టు జీవో నెం­బ­ర్ 9పై వి­ధిం­చిన స్టే­ను సు­ప్రీం­కో­ర్టు­లో సవా­ల్ చే­య­డం ప్ర­భు­త్వా­ని­కి ఉన్న తొలి ఆప్ష­న్. దీ­ని­పై స్పె­ష­ల్ లీవ్ పి­టి­ష­న్ దా­ఖ­లు చేసి, వి­చా­ర­ణ­కు వచ్చే­లా చూ­డ­టం. గతం­లో సు­ప్రీం­కో­ర్టు ఇచ్చిన తీ­ర్పు మే­ర­కు ట్రి­పు­ల్ టె­స్ట్ ప్ర­క్రి­య­ను రి­జ­ర్వే­ష­న్లు పెం­పు సం­ద­ర్భం­గా పా­టిం­చి­న­ట్లు చట్ట­ప­రం­గా ని­రూ­పిం­చా­ల్సి ఉం­టుం­ది.

హై­కో­ర్టు ఆదే­శాల మే­ర­కు స్థా­నిక సం­స్థల ఎన్ని­క­లు త్వ­ర­గా ని­ర్వ­హిం­చా­ల­ను­కుం­టే, పాత రి­జ­ర్వే­ష­న్ల­నే అమలు చే­స్తూ ఎన్ని­కల ప్ర­క్రి­య­లో ముం­దు­కు సా­గ­డం రెం­డో ఆప్ష­న్. లేదా ప్ర­భు­త్వం దీ­ని­పై సు­ప్రీం­లో పి­టి­ష­న్ వే­య­క­పో­యి­నా, ఒక­వేళ పి­టి­ష­న్ వే­సి­న­ప్ప­టి­కీ జీవో నెం­బ­ర్ 9పై స్టే ఎత్తి­వే­య­క­పో­తే ఉన్న మరో ఆప్ష­న్... 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు బదు­లు, పాత రి­జ­ర్వే­ష­న్ల­తో­నే ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చ­డం.

గవ­ర్న­ర్ ఆమో­దం లే­కుం­డా­నే బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల అమ­లు­కు జీవో నెం­బ­ర్ 9ను జారీ చే­య­డం­పై హై­కో­ర్టు­లో వా­దో­ప­వా­దా­లు జరి­గా­యి. ఈ జీ­వో­కు చట్ట­బ­ద్ధ సవరణ చే­య­డం మరో ఆప్ష­న్ గా చె­ప్ప­వ­చ్చు. బీసీ బి­ల్లు­ను గవ­ర్న­ర్ ద్వా­రా ఆమో­దిం­ప­జే­య­డం, హై­కో­ర్టు లే­వ­నె­త్తిన సాం­కే­తిక అం­శా­ల్లో ఇబ్బం­దు­లు లే­కుం­డా చర్య­లు తీ­సు­కో­వ­డం ఈ ఆప్ష­న్‌­లో భా­గం­గా చె­ప్ప­వ­చ్చు.

Tags:    

Similar News