MP Kavitha : కేంద్ర మంత్రి బిఎల్ వర్మకు సవాల్ విసిరిన ఎంపీ కవిత..
MP Kavitha : కేంద్ర మంత్రి బిఎల్ వర్మపై మహబూబాబాద్ ఎంపీ కవిత నిప్పులు చెరిగారు.;
MP Kavitha : కేంద్ర మంత్రి బిఎల్ వర్మపై మహబూబాబాద్ ఎంపీ కవిత నిప్పులు చెరిగారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే... ఆదాని, అంబానీల సంక్షేమం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి బిఎల్ వర్మ... దమ్ముంటే మరో రెండు రోజులు జిల్లాలో తిరిగి ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్, నర్సింగ్ కాలేజీలు, కలెక్టరేట్‌లను సందర్శించాలన్నారు. తమతో వస్తే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి సంక్షేమాన్ని దగ్గరుండి చూపిప్తామన్నారు.