METRO: తెలంగాణ ప్రభుత్వం చేతికి మెట్రో తొలి దశ
టేకోవర్ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం
హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎల్ అండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. ప్రభుత్వం LTMRHL పూర్తి రుణాన్ని స్వాధీనం చేసుకుని, వారి ఈక్విటీ విలువకు దాదాపు రూ.5900 కోట్లు చెల్లించనుంది. ఎల్అండ్టీకి ఉన్న రూ.13000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మెట్రో నష్టాలు.. ప్రభుత్వమే తేల్చుకోవాలి"
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పర్యావరణానికి,వన్యప్రాణులకు ఎలాంటి నష్టం లేకుండా హైవేల నిర్మాణం చేపడతామన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చిందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారని అన్నారు. ‘‘భూసేకరణ త్వరగా పూర్తిచేస్తే.. ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా అవుతుంది. మెట్రో విస్తరణలో సీఎం వ్యవహారశైలి సమంజసంగా లేదు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని కోరుకునే వ్యక్తుల్లో ముందుంటా. ఆర్ఆర్ఆర్, మెట్రో విషయంలో ప్రోయాక్టివ్‌గా వ్యవహరించాం. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది. మెట్రో నష్టాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం.. వారే తేల్చుకోవాలి. మెట్రోకు అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. కాళేశ్వరంపై సీబీఐ ప్రతిపాదనలు అందాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.