జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి యువకుల హల్‌చల్.. నడిరోడ్డుపై ఇనుపరాడ్లతో
జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి పది మంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి గలాటా సృష్టించారు. కర్రలు, ఇనుపరాడ్లతో హల్‌చల్ చేశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.;
నగరంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంలో హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి పది మంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి గలాటా సృష్టించారు. కర్రలు, ఇనుపరాడ్లతో హల్‌చల్ చేశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పీకలదాకా తాగి మత్తు తలకెక్కి రోడ్లపై వెళ్తున్న వాహనాలపై దాడులకు తెగబడ్డారు. వాహనదారులపై రాళ్లతో దాడిచేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.