బీజేపీ తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్ రావు
బీజేపీ తీరుపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు.. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత తరపున ప్రచారం నిర్వహిస్తున్న హరీష్ రావు.. విపక్షాల విమర్శలపై మండిపడ్డారు..;
బీజేపీ తీరుపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు.. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత తరపున ప్రచారం నిర్వహిస్తున్న హరీష్ రావు.. విపక్షాల విమర్శలపై మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా..? దీనిపై సవాలు విసిరితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఎండమావుల్లాంటివి అవి వస్తుంటాయ్ పోతుంటాయ్.. కానీ టీఆర్‌ఎస్ ఎప్పటికీ ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణంగానే కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని.. కొండపోచమ్మ సాగర్ నిండిందని హరీష్ రావు గుర్తు చేశారు.