Nagarjuna : వెయ్యి ఎకరాలు దత్తత తీసుకున్న నాగార్జున
Nagarjuna : బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ని కూడా నాగార్జున చెట్లు నాటమని చెప్పారు.;
Nagarjuna : సినీ నటుడు నాగార్జున మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట 1080 ఎకరాలు దత్తత తీసుకుని ఎంపీ సంతోష్, అమల, నాగచైతన్య, అఖిల్‌తో పాటు కుటుంబసభ్యులు అందరూ కలిసి చెట్లు నాటారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ని కూడా నాగార్జున చెట్లు నాటమని చెప్పారు.
ఇటీవల జరిగిన బిగ్‌బాస్ ఫినాలేకి చీఫ్‌గెస్ట్‌గా వచ్చిన సంతోష్ కుమార్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తాను సహాయపడతానని నాగార్జున ఆ వేదిక మీద మాట ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు శంకుస్థాపన చేశారు. అంతే కాకుండా రూ.2 కోట్ల చెక్కును హరిత నిధికి అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు తనవంతు సహాయాన్ని నిరంతరం కొనసాగిస్తానని నాగార్జున ఈ సందర్భంగా అన్నారు.