తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి.;
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. దట్టంగా ఆవరించన మేఘాలతో పట్ట పగలే చీకట్లు కమ్ముకున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్, సికింద్రాబాద్‌లో వర్షం పడుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాల్ని జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, వికారాబాద్ జిల్లా పరిగి, సిద్దిపేట, గజ్వేల్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది.