REVANTH: సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ఛానెల్‌లో నిధులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి.. సంక్షేమ హాస్టళ్లపై సీఎం సమీక్ష.. ప్రత్యే దృష్టి సారించాలని ఆదేశం

Update: 2025-10-14 03:30 GMT

తె­లం­గా­ణ­లో­ని ప్ర­భు­త్వ సం­క్షేమ హా­స్ట­ళ్ల­పై ప్ర­త్యే­కం­గా దృ­ష్టి సా­రిం­చా­ల­ని అధి­కా­రు­ల­ను ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి ఆదే­శిం­చా­రు. హా­స్ట­ళ్ల­లో బోధన, బో­ధ­నే­తర సి­బ్బం­ది­కి ముఖ గు­ర్తిం­పు హా­జ­రు వి­ధా­నం అమలు చే­యా­ల­న్నా­రు. పూ­ర్తి డే­టా­తో సం­క్షేమ హా­స్ట­ళ్ల వ్య­వ­స్థ­లో జవా­బు­దా­రీ­త­నం కని­పిం­చా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై­నా­ర్టీ, సం­క్షే­మ­శా­ఖ­ల­పై కమాం­డ్‌ కం­ట్రో­ల్‌ కా­ర్యా­ల­యం­లో ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌ రె­డ్డి సమీ­క్షిం­చా­రు. వి­ద్యా­ర్థు­ల­కు అం­దిం­చే భో­జ­నం నా­ణ్య­త­ను సాం­కే­తిక పరి­జ్ఞా­నం­తో తని­ఖీ చే­యా­ల­న్నా­రు. వి­ద్యా­ర్థు­ల­కు సరైన పో­ష­కా­ల­తో కూ­డిన పౌ­ష్టి­కా­హా­రం అం­దే­లా చర్య­లు తీ­సు­కో­వా­ల­న్నా­రు. హా­స్ట­ళ్ల­లో వి­ద్యా­ర్థు­ల­కు అం­దిం­చే దు­స్తు­లు, పు­స్త­కా­లు, వా­రి­కి చే­రు­తు­న్నా­యో లేదో ధ్రు­వీ­క­రిం­చా­ల­ని చె­ప్పా­రు. రా­ష్ట్రం­లో­ని గు­రు­కు­లా­లు, వసతి గృ­హా­ల­కు ప్ర­తి నెలా గ్రీ­న్‌­ఛా­నె­ల్‌­లో ని­ధు­లు అం­దిం­చేం­దు­కు కా­ర్యా­చ­రణ సి­ద్ధం చే­యా­ల­ని రే­వం­త్‌­రె­డ్డి అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. అక్కడ పని­చే­స్తు­న్న బోధన, బో­ధ­నే­తర సి­బ్బం­ది, వి­ద్యా­ర్థుల హా­జ­రు­కు ము­ఖ­గు­ర్తిం­పు వ్య­వ­స్థ­ను ఏర్పా­టు చే­యా­ల­న్నా­రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై­నా­ర్టీ గు­రు­కు­లా­ల్లో అత్య­వ­సర పనుల కోసం ము­ఖ్య­మం­త్రి సహాయ నిధి నుం­చి రూ.60 కో­ట్లు కే­టా­యిం­చి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు.

సాంకేతిక పరిజ్ఞానంతో..

ప్ర­తి హా­స్ట­ల్‌­లో మౌ­లిక సదు­పా­యా­ల­పై పూ­ర్తి స్థా­యి డే­టా­ను సాం­కే­తిక పరి­జ్ఞా­నం­తో ఎప్ప­టి­క­ప్పు­డు ఆన్‌­లై­న్‌­లో అప్‌­డే­ట్‌ చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను సీఎం రే­వం­త్‌­రె­డ్డి ఆదే­శిం­చా­రు. వి­ద్యా­ర్థుల ఆరో­గ్య పరి­స్థి­తి­ని సమీ­క్షిం­చేం­దు­కు ప్ర­త్యేక వి­ధా­నం అను­స­రిం­చా­ల­ని, హా­స్ట­ళ్ల­ను సమీ­పం­లో­ని వై­ద్య కళా­శా­ల­లు, కమ్యూ­ని­టీ హె­ల్త్‌ సెం­ట­ర్ల­కు అను­సం­ధా­నం చే­యా­ల­ని సీఎం సూ­చిం­చా­రు. అధి­కా­రు­లు తరచూ హా­స్ట­ళ్ల­ను సం­ద­ర్శిం­చి ఆరో­గ్య తని­ఖీ­లు చే­యా­ల­ని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. రా­ష్ట్రం­లో సం­క్షేమ హా­స్ట­ళ్ల­కు సం­బం­ధిం­చి ప్ర­తి­నె­లా గ్రీ­న్‌ ఛా­నె­ల్‌­లో ని­ధు­లు అం­దే­లా కా­ర్యా­చ­రణ ప్ర­ణా­ళిక రూ­పొం­దిం­చా­ల­ని అధి­కా­రు­ల­ను సీఎం ఆదే­శిం­చా­రు. ఈ ని­ధు­ల­ను తా­త్కా­లిక సి­బ్బం­ది వే­త­నా­లు, వసతి గృ­హా­ల్లో మో­టా­ర్ల మర­మ్మ­తు­లు, ఇతర అత్య­వ­సర  పను­ల­కు వి­ని­యో­గిం­చా­ల­ని సూ­చిం­చా­రు. సో­మ­వా­ర­మి­క్కడ మం­త్రు­లు పొ­న్నం ప్ర­భా­క­ర్, అడ్లూ­రి లక్ష్మ­ణ్‌­తో కలి­సి సం­క్షే­మ­శా­ఖ­ల­పై సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. గు­రు­కుల సొ­సై­టీల ని­ధు­ల­కు సం­బం­ధిం­చిన చె­క్కు­ల­ను ఆయా శాఖల ఉన్న­తా­ధి­కా­రు­ల­కు అం­ద­జే­శా­రు.

Tags:    

Similar News