REVANTH:గాంధీ సరోవర్ వద్ద గేట్‌ వే ఆఫ్ హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు... అధునాతనలతో ప్రాజెక్టులతో అభివృద్ధి... పర్యాటకులకు స్వాగతం పలికేలా గేట్ వే;

Update: 2025-08-10 05:30 GMT

హై­ద­రా­బా­ద్ అర్బ­న్ సిటీ ఏరి­యా­లో చే­ప­ట్టే మూసీ పు­న­రు­జ్జీవ ప్రా­జె­క్ట్ ను బహుళ ప్ర­యో­జ­నా­లుం­డే­లా అత్యంత అధు­నా­త­నం­గా ని­ర్మిం­చా­ల­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి అధి­కా­రు­ల­ను అదే­శిం­చా­రు. వి­విధ ప్రాం­తాల నుం­చి వచ్చే పర్యా­ట­కు­ల­కు స్వా­గ­తం పలి­కే­లా హై­ద­రా­బా­ద్ ము­ఖ­ద్వా­రం­గా హి­మా­య­త్ సా­గ­ర్ గాం­ధీ సరో­వ­ర్ దగ్గర ఓఆ­ర్ఆ­ర్ పై గేట్ వే అఫ్ హై­ద­రా­బా­ద్ ని­ర్మిం­చా­ల­ని సూ­చిం­చా­రు. ఓఆ­ర్ఆ­ర్ కు ఒక వై­పున ఎకో థీమ్ పా­ర్క్ అభి­వృ­ద్ధి చేసి మరో­వై­పున బాపూ ఘాట్ వైపు భారీ ఐకా­ని­క్ టవర్ ని­ర్మిం­చా­ల­ని.. అం­దు­కు తగిన వి­ధం­గా డి­జై­న్లు రూ­పొం­దిం­చా­ల­ని సీఎం అదే­శిం­చా­రు. ఓఆ­ర్ఆ­ర్ కు ఒక వై­పున ఉండే ఎకో థీమ్ పా­ర్క్.. మరో వై­పున ని­ర్మిం­చే ఐకా­ని­క్ టవర్ కు చే­రు­కు­నేం­దు­కు ప్ర­యా­ణా­ల­కు వీ­లు­గా ఎలి­వే­టె­డ్ గేట్ వే ని­ర్మిం­చి దా­న్ని గేట్ వే అఫ్ హై­ద­రా­బా­ద్ గా డి­జై­న్ చే­యా­ల­ని సీఎం అదే­శిం­చా­రు.

ప్రపంచంలోనే ఎత్తైన టవర్, ఎకో థీమ్ పార్కు

'గేట్ వే ఆఫ్ హైదరాబాద్' ప్రాజెక్ట్‌లో భాగంగా ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)కు ఒక వైపు ఎకో థీమ్ పార్కును, [మరో వైపు బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్‌ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ఐకానిక్ టవర్ కోసం అవసరమైన డిజైన్‌లు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా.. ఈ థీమ్ పార్కు, టవర్‌ను అనుసంధానం చేస్తూ ఒక ఎలివేటెడ్ గేట్‌వేని నిర్మించాలని చెప్పారు. ఇది విమానాశ్రయం నుంచి నే­రు­గా గాం­ధీ సరో­వ­ర్‌­కు చే­రు­కు­నే­లా ఒక కనె­క్టి­వ్ కా­రి­డా­ర్‌­గా ఉం­టుం­ద­ని వి­వ­రిం­చా­రు. ఈ ప్రా­జె­క్టు­తో హై­ద­రా­బా­ద్ పర్యా­టక రం­గం­లో కొ­త్త అధ్యా­యం మొ­ద­ల­వు­తుం­ది.

రెండు నెలల్లో టెండర్లు

తాగు నీ­టి­తోపాటు వరద నీటి ని­ర్వ­హ­ణ­కు వీ­లు­గా మూసీ పు­న­రు­జ్జీవ ప్రా­జె­క్టు ఉం­డా­ల­ని, వి­విధ దే­శా­ల్లో అమ­ల్లో ఉన్న ప్రా­జె­క్టు నమూ­నా­లు పరి­శీ­లిం­చా­ల­ని ము­ఖ్య­మం­త్రి చె­ప్పా­రు. ఉస్మా­న్ సా­గ­ర్ హి­మా­య­త్ సా­గ­ర్ తాగు నీ­టి­ని హై­ద­రా­బా­ద్ నగర అవ­స­రా­లు తీ­ర్చేం­దు­కు మరింత సమ­ర్థం­గా వి­ని­యో­గిం­చు­కు­నే­లా ప్లా­నిం­గ్ చే­యా­ల­న్నా­రు. గాం­ధీ సరో­వ­ర్ ను అం­త­ర్జా­తీయ స్థా­యి­లో అభి­వృ­ద్ధి చేసే పను­ల­కు వా­ట­ర్ ఫ్లో స్ట­డీ­స్ పక్కా­గా చే­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­ను అప్ర­మ­త్తం చే­శా­రు. రెం­డు నె­ల­ల్లో టెం­డ­ర్లు పి­లి­చేం­దు­కు వీ­లు­గా పనుల వేగం పెం­చా­ల­ని ము­ఖ్య­మం­త్రి అధి­కా­రు­ల­ను అదే­శిం­చా­రు. ఔట­ర్‌ రిం­గ్‌ రో­డ్‌ పరి­ధి­లో­ని వా­ర­స­త్వ కట్ట­డాల సం­ర­క్షణ కోసం కు­లీ­కు­తు­బ్‌‌ షాహీ అర్బ­న్ డె­వ­ల­ప్‌­‌­మెం­ట్ అథా­రి­టీ మా­ర్గ­ద­ర్శ­కా­ల­ను సవ­రిం­చా­ల­ని, మరింత బలో­పే­తం చే­యా­ల­ని రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. హై­ద­రా­బా­ద్‌­లో­ని పా­త­బ­స్తీ మె­ట్రో­కు ఇప్ప­టి­కే ని­ధు­లు వి­డు­దల చే­శా­మ­ని,పను­లు వే­గ­వం­తం చే­యా­ల­ని చె­ప్పా­రు.

Tags:    

Similar News