REVANTH: మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయింది

మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే... మోదీ చేసిందేమీ లేదన్న రేవంత్‌రెడ్డి;

Update: 2024-05-07 04:00 GMT

మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అంబర్ పేట, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా.రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. గత కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. గతంలోనే హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి జలాలుతీసుకొచ్చామని చెప్పారు. మెట్రో రైలు కూడా రావడానికి.. కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. కేంద్రంలోని భాజపా సర్కార్ హైదరాబాద్ కు ఒక్క పైసా పనిచేయలేదన్నారు. పదేళ్లలో నరేంద్రమోదీ.పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి వివరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన పలువురు బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర నేతలు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్ సభ ఎన్నికల వేళ నియోజకవర్గనేత శ్రీరామ్ పార్టీలో చేరడంతమకు బలం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.


హైదరాబాద్‌కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా అంబర్‌పేటలో రోడ్ షో నిర్వహించారు సీఎం.  కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి అయిందన్నారు.  గత కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్ కు  ఓఆర్‌ఆర్‌, ఫార్మా పరిశ్రమలు వచ్చాయన్నారు. గతంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చామని చెప్పారు.  ఇకపై అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిర్వహిస్తామని తెలిపారు సీఎం. మరోసారి కిషన్ రెడ్డి ఎంపీ అయితే ఉపయోగం లేదని.. దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో  గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని  చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.  మోదీ గ్యారెంటీకి వారెంటీ అయిపోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు.  

లోక్ సభ ఎన్నికల ప్రచారాలతో తెలంగాణ హోరెత్తిపోతున్న వేళ.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు వినిపించింది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించిన రేవంత్ రెడ్డి సర్కారు.. ప్రస్తుతం ఐదెకరాల పైన భూమి ఉన్న అన్నదాతలకు రైతు బంధు డబ్బులను సోమవారం విడుదల చేసింది. ఈ ఆనందంలో ఉన్న సమయంలో.. సర్కారు మరో శుభవార్త వినిపించింది.

Tags:    

Similar News