REVANTH: మీ గుండెల్లో రాసుకోండి.. పదేళ్లు నేనే సీఎం

కేసీఆర్‌, కేటీఆర్‌కు రేవంత్ స్పష్టీకరణ.. పదేళ్లు పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ తీవ్ర విమర్శలు;

Update: 2025-07-19 02:30 GMT

తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి లి­ఫ్ట్ ఇరి­గే­ష­న్ ప్రా­జె­క్టు పూ­ర్తి చే­య­డం­లో తన ని­బ­ద్ధ­త­ను ప్ర­క­టిం­చా­రు. ఈ ప్రా­జె­క్టు­తో­పా­టు దిం­డి, కల్వ­కు­ర్తి, భీమా, నె­ట్టెం­పా­డు, కో­యి­ల్‌­సా­గ­ర్ వంటి కీలక ప్రా­జె­క్టు­ల­ను అడ్డు­కు­నే ప్ర­య­త్నా­ల­ను ఆయన తీ­వ్రం­గా ఖం­డిం­చా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు.. రా­య­ల­సీమ లి­ఫ్ట్ ఇరి­గే­ష­న్‌ ప్రా­జె­క్ట్ రద్దు చే­సు­కో­వా­ల­ని, అం­దు­కు సహ­క­రిం­చా­ల­ని సీఎం రే­వం­త్ వి­జ్ఞ­ప్తి చే­శా­రు. సహ­కా­రం లే­క­పో­తే పో­రా­టం తప్ప­ద­ని అన్నా­రు. పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి ప్రా­జె­క్టు­ను వి­జ­య­వం­తం­గా పూ­ర్తి చే­య­డం తన బా­ధ్యత అంటూ స్ప­ష్టం చే­శా­రు. నా­గ­ర్ కర్నూ­ల్ జి­ల్లా కొ­ల్లా­పూ­ర్ మం­డ­లం జట­ప్రో­లు­లో యంగ్ ఇం­డి­యా ఇం­టి­గ్రే­టె­డ్ స్కూ­ల్ కు రే­వం­త్ రె­డ్డి శం­కు­స్థా­పన చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా బహి­రంగ సభలో ఆయన ప్ర­సం­గిం­చా­రు.

‘పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి­ని పూ­ర్తి చే­య­లే­దు. కల్వ­కు­ర్తి, నె­ట్టెం­పా­డు, బీమా ప్రా­జె­క్టు­లు చే­య­లే­దు. లక్ష కో­ట్లు పె­ట్టి కట్టిన కా­ళే­శ్వ­రం మూ­డే­ళ్ల­ల్లో కూ­లే­శ్వ­రం అయిం­ది. కాం­గ్రె­స్ వస్తే కరెం­టు ఉం­డ­ద­న్నా­రు.. కానీ రై­తు­ల­కు 24 గం­ట­లు ఉచిత కరెం­టు ఇస్తు­న్నాం.. వరి­కి బో­న­స్ ఇచ్చి ప్ర­తీ గింజ కొం­టు­న్నాం.. మొ­ద­టి ఏడా­ది­లో­నే రూ.21 వేల కో­ట్ల­తో రై­తు­ల­కు రు­ణ­మా­ఫీ చే­శాం.. 9 రో­జు­ల్లో 9 వే­ల­కో­ట్లు రై­తు­భ­రో­సా ఇచ్చాం.. స్వ­యం సహా­యక సం­ఘా­ల­ను ప్రో­త్స­హిం­చి వా­రి­కి రు­ణా­లు అం­ది­స్తు­న్నాం. అమ్మ ఆద­ర్శ పా­ఠ­శా­లల ని­ర్వ­హణ బా­ధ్యత వా­రి­కే అప్ప­గిం­చాం.. ప్ర­భు­త్వ కా­ర్యా­ల­యా­ల్లో ఇం­ది­రా మహి­ళా శక్తి క్యాం­టీ­న్‌­ల­ను ఏర్పా­టు చేసి ఆడ­బి­డ్డ­ల్ని వ్యా­పా­రా­ల్లో ప్రో­త్స­హి­స్తు­న్నాం.. సో­లా­ర్ ప్లాం­ట్ ఏర్పా­టు, పె­ట్రో­ల్ బ్యాం­కుల ఏర్పా­టు­కు ప్రో­త్స­హిం­చి అం­బా­నీ, అదా­నీ­తో పోటీ పడే­లా ఆడ­బి­డ్డ­ల­కు అప్ప­గిం­చాం.. 60 వేల ప్ర­భు­త్వ ఉద్యో­గా­లు ఇచ్చాం.. ఇలా మొ­ద­టి ఏడా­ది­లో­నే ఎన్నో పను­లు చే­శాం. కే­సీ­ఆ­ర్ నీ గుం­డె­ల­పై రాసి పె­ట్టు­కో.. 2034 వరకు ఈ పా­ల­మూ­రు బి­డ్డే రా­ష్ట్రా­ని­కి ము­ఖ్య­మం­త్రి­గా ఉం­టా­డు’ అని సీఎం రే­వం­త్ రె­డ్డి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు.

చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ సీఎం చం­ద్ర­బా­బు రెం­డు రా­ష్ట్రా­ల­ను సమా­నం­గా చూ­డా­ల­ని  తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. రా­య­ల­సీమ లి­ఫ్ట్ ఇరి­గే­ష­న్ ప్రా­జె­క్టు­ను రద్దు చే­యా­ల­న్నా­రు. తె­లం­గా­ణ­లో కృ­ష్ణా­పై చే­ప­డు­తు­న్న ప్రా­జె­క్టు­ల­కు అడ్డం పడ­వ­ద్ద­ని సహ­క­రిం­చా­ల­ని కో­రా­రు. ప్రా­జె­క్టు­కు­ల­కు సహ­క­రిం­చ­క­పో­తే పో­రా­టం చే­స్తా­మ­న్నా­రు. పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి ప్రా­జె­క్టు­ను చం­ద్ర­బా­బు అడ్డు­కో­వ­డం న్యా­యం కా­ద­న్నా­రు. కో­యి­ల్ సా­గ­ర్ సహా ఇతర ప్రా­జె­క్టు­ల­ను అడ్డు­కో­వ­ద్ద­న్నా­రు.  పా­ల­మూ­రు ప్రా­జె­క్టు­ల­ను పూ­ర్తి చేసే బా­ధ్యత తన­దే­న­న్నా­రు.

Tags:    

Similar News