Seasonal diseases : తెలంగాణలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు..!
తెలంగాణలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయని.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు;
తెలంగాణలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయని.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా కేసులు కలవర పెడుతున్నాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతోందన్న ఆయన.. అవసరమైన చోట మెడికల్ క్యాంపులు పెడతామని తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల DMHOలను అలర్ట్ చేశామన్నారు. ఇక డెంగీ విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై గతంలో ఇచ్చిన నెంబర్లకు ఫిర్యాదు చేయొచ్చన్న డీహెచ్.. ప్లేట్‌లెట్స్ విషయంలో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.