Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేేశాలకు ఇంకా కొన్ని గంటలే..

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయింది. మూడు రోజుల పాటు శాసనసభ జరపాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం

Update: 2022-09-04 09:40 GMT

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయింది. మూడు రోజుల పాటు శాసనసభ జరపాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సెషన్స్‌పై చర్చ జరిగింది.

ఈ నెల 6, 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై కూడా చర్చించారు.

శాసనసభ వర్షాకాల సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలన్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పోడు భూముల అంశం, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, విద్యుత్ బకాయిలు సహా వివిధ అంశాల్లో కేంద్ర వైఖరి గురించి కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

సీబీఐకి రాష్ట్రంలో అనుమతి నిరాకరణ వంటి పలు అంశాలపైనా అసెంబ్లీలో చర్చపెట్టాలన్న అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. వీటితో పాటు మున్సిపల్ యాక్ట్, పరిశ్రమల యాక్ట్, అటవీ యాక్ట్, విద్యాశాఖ యాక్ట్ సవరణపైనా చర్చ జరిగింది.

Tags:    

Similar News