KCR : ద‌ర్శనం మొగిల‌య్యకు సీఎం కేసీఆర్ భారీ న‌జ‌రానా

KCR : హైద‌రాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయ‌ల‌ను కేసీఆర్‌ ప్రకటించారు.

Update: 2022-01-28 16:15 GMT

KCR : కిన్నెల మెట్ల కళాకారుడు ద‌ర్శనం మొగిల‌య్యకు సీఎం కేసీఆర్ భారీ న‌జ‌రానా ప్రక‌టించారు. హైద‌రాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయ‌ల‌ను కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని.. కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు.

ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన మొగిలయ్య.. ఇవాళ కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో క‌లిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్‌ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

ఇక ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

Full View


Similar News