Dalit Bandhu scheme : దళితబంధు పథకం కోసం మరో రూ.300 కోట్లు రిలీజ్..!
Dalit Bandhu scheme : హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసింది.;
Dalit Bandhu scheme : హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం(Dalit Bandhu scheme) కోసం తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసింది. తాజాగా మరో రూ.300 కోట్లను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకి బదిలీ చేసింది. ఇప్పటికివరకు నాలుగు విడతలుగా రూ.1500 కోట్లు విడుదలయ్యాయి. త్వరలో మరో రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. కాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కోసం రూ. 2000 కోట్లు ఖర్చు చేస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ వెల్లడించారు.