సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ జామర్ కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓఆర్ఆర్ వద్ద ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని జామర్ టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని నియంత్రించటంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు స్టెప్నీ టైర్ అమర్చటంతో వాహనం తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేరింది. ఈ ఘటనతో కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జామర్ వాహనానికి స్టెప్నీ టైర్‌ను అమర్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా, వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది.