శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పీవీ సంధుకు ఘనస్వాగతం..!
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న తర్వాత భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్నారు.;
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న తర్వాత భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్నారు. తెలుగుతేజం సింధూకు శంషాబాద్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పీవీ సింధు, కోచ్ పార్క్ తై సేంగ్‌నకు ఘన స్వాగతం పలికారు. పీవీ సింధు తల్లిదండ్రులతోపాటు సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సీపీ సజ్జనార్, పీవీ సింధుకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
పీవీ సింధును చూసేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి స్పోర్ట్స్ పర్సన్స్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం తనకు అన్నివిధాల సహకరించటం వల్లే ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచినట్లు స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. తనకు ఎల్లప్పుడు అండగా ఉంటూ వెన్నంటి ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు పీవీ సింధు. కరోనా సమయంలోనూ తన శిక్షణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించినట్లు సింధు పేర్కొన్నారు. అందరి ప్రోత్సహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని పీవీ సింధు ధీమా వ్యక్తం చేశారు.