జొమాటో బాయ్ జీవితాన్ని మార్చిన సైకిల్ ..
కస్టమర్ టీ ఆర్డ్రర్ ఇచ్చారు. జోరున కురుస్తున్న వర్షంలో డెలివరీ బాయ్ సైకిల్‌పై రావడం చూసి అతడి కళ్లు చెమర్చాయి.;
కస్టమర్ టీ ఆర్డ్రర్ ఇచ్చారు. జోరున కురుస్తున్న వర్షంలో డెలివరీ బాయ్ సైకిల్‌పై రావడం చూసి కస్టమర్ కళ్లు చెమర్చాయి. వెంటనే అతడికి బైక్ కొనివ్వాలన్న ఆలోచన మెదడులో మెదిలింది. నలుగురి సహాయం తీసుకుని డిలివరీ బాయ్ చేతికి బైక్ కీస్ ఇచ్చారు రాబిన్.
హైదరాబాద్ లోని కోటి ప్రాంతంలో నివసిస్తున్న ఐటి ఉద్యోగి రాబిన్ ముఖేష్ జూన్ 14 న ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా టీని ఆర్డర్ చేశాడు. "నేను ఇంటి నుండి పని చేస్తున్నాను మరియు రాత్రి 10 గంటలకు, నేను హైదరాబాద్ లోని లక్ది-కా-పూల్ లోని ఒక హోటల్ నుండి టీని ఆర్డర్ చేశాను. నా ఆర్డర్ ట్రాక్ చేస్తున్నప్పుడు, నా ఆర్డర్ కేటాయించిన మొహమ్మద్ అకీల్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని గమనించాను. నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు అతడు మెహదీపట్నంలో ఉన్నారు".
టీ ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లో, తన అపార్టుమెంటు వద్దకు ఆర్డర్ వచ్చిందని డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుండి తనకు కాల్ వచ్చిందని రాబిన్ పేర్కొన్నాడు. "డెలివరీ ఎగ్జిక్యూటివ్ నన్ను మెట్లమీదకు రమ్మని, ఆర్డర్ స్వీకరించమని అభ్యర్థించాడు" అని రాబిన్ చెప్పాడు.
"నేను మెట్ల మీదకు వెళ్ళేటప్పుడు, వర్షం కారణంగా నీటిలో పూర్తిగా తడిసిన ఒక యువకుడిని చూశాను. అతను కేవలం 15 నిమిషాల్లో సైకిల్‌పై వచ్చాడని తెలిసి మరింత ఆశ్చర్యపోయాను. సైకిల్‌పై ఆర్డర్‌ను ఇంత త్వరగా ఎలా ఇవ్వగలిగావు అని అతడిని అడిగినప్పుడు.. నాకు ఇది అలవాటే సార్ సంవత్సరానికి పైగా సైకిల్‌పై ఫుడ్ ఆర్డర్‌లను పంపిణీ చేస్తున్నానని చెప్పాడు.
నేను నీ ఫోటో తీసుకోవచ్చా అని అతన్ని అడిగాను. అకీల్‌తో సంభాషనను మరింత కొనసాగిస్తూ అతడు ఇంకా ఏం చేస్తుంటాడో కనుక్కున్నాను. అతడు బిటెక్ చదువుతున్నట్లు చెప్పాడు. ఇదంతా విన్న రాబిన్ వెంటనే ఈ విషయాలన్నీ 32 వేల మంది ఉన్న 'ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్' ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశాడు. అతడికి టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనం కొనేందుకు రూ.65,800 కావాలని విజ్ఞప్తి చేశాడు. అకిల్ మొత్తం కథతో పాటు చిత్రాన్ని అప్‌లోడ్ చేసాను. నేను చిత్రాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వెంటనే, అనేక ప్రశంస వ్యాఖ్యలు వచ్చాయి మరియు చాలా మంది అకిల్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు"
ఈ పోస్టు చూసిన వారంతా వెంటనే స్పందించి తోచినంత సహాయం చేశారు. దీంతో రెండు రోజుల్లోనే రూ.73 వేలు పోగయ్యాయి. తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్న డెలివరీ బాయ్‌కి బైక్‌ని బహుమతిగా ఇవ్వడానికి ఇంత మంది సహకరించడం ఆనందంగా ఉందన్నారు రాబిన్.
"నేను అకీల్‌కు ఏమి సహాయం కావాలి అని అడిగినప్పుడు, అతను మోటారుబైక్‌ను పొందగలిగితే అది చాలా గొప్పదని చెప్పాడు. కాబట్టి వెంటనే, నేను మంగళవారం రాత్రి నిధుల సమీకరణను ప్రారంభించాను మరియు ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఉదయానికే బైక్‌కి కావలసిన డబ్బు సమకూరింది. యుఎస్‌ఎలో ఉంటున్న ఒక మహిళ సుమారు రూ .30,000 పంపించింది. "
అకీల్‌కు సహాయం చేయడానికి ఆన్‌లైన్ నిధుల సేకరణ ద్వారా కేవలం 12 గంటల్లోనే రూ .73 వేలు సేకరించాను. ఇంకా నిధులు వస్తూనే ఉన్నందున ఇంక చాలు పంపించవద్దని నెటిజన్స్‌కి చెప్పాల్పి వచ్చింది.
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌ను అకీల్ కోసం కొనుగోలు చేసిన తరువాత కోవిడ్ మహమ్మారి సమయంలో అవసరమైన అన్ని వస్తువులు మాస్కులు, శానిటైజర్లు, బైక్‌తో పాటు హెల్మెట్‌ను అతనికి అందజేశారు.
"ఇవన్నీ కొనుగోలు చేసిన తరువాత, రూ .5 వేలు మిగిలి ఉన్నాయి. తరువాత వాటిని అకీల్ కాలేజీ ఫీజు చెల్లించడానికి ఉపయోగించాను" అని రాబిన్ చెప్పారు.
రాబిన్ గత రెండు సంవత్సరాలుగా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. అతడు నగరంలోని పలు ఎన్జీఓలతో సంబంధం కలిగి ఉన్నాడు. ఫేస్‌బుక్‌లో కేవలం ఒక పోస్ట్‌తో అకీల్‌కు సహాయం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. "సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా ద్వేషాన్ని రగిల్చే బదులు అవసరమైన వారికి సహాయపడటానికి ఉపయోగించవచ్చు అని ఆయన అన్నారు.
అకిల్ మీడియాతో మాట్లాడుతూ బైక్ తీసుకోవడంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. తనకు లభించిన సహాయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, సాధ్యమైనప్పుడల్లా తానూ ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేస్తానని పేర్కొన్నాడు.