మాంగల్య దోషం.. 13 ఏళ్ల బాలుడిని పెళ్లాడిన ట్యూషన్ టీచర్.. !
మాంగల్యదోషం పోగొట్టుకోవడానికి ఓ లేడీ ట్యూషన్ టీచర్ ఓ 13 ఏళ్ల బాలుడిని పెళ్ళాడింది. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగు చూసింది.;
మాంగల్య దోషం పోగొట్టుకోవడానికి ఓ లేడీ ట్యూషన్ టీచర్ ఓ 13 ఏళ్ల బాలుడిని పెళ్ళాడింది. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళ్తే..బస్తీ బావా ఖేల్ ప్రాంతంలోని ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినప్పటికీ ఆమెకి వివాహం జరగడం లేదు.. దీనితో వారు పూజారికి ఆమె జాతకం చూపించగా యువతి పుట్టిన జాతకం ప్రకారం ఆమెకు మాంగళ్య దోషం ఉందని చెప్పారు.
అయితే దిని నివారణకి గాను ఆమెకి ఓ మైనర్ బాలుడితో వివాహం జరిపించాలని సదరు పూజారి సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చే ఓ 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసేందుకు సిద్ధపడింది ఆ యువతి.. ట్యూషన్ క్లాసుల కోసం బాలుడు ఓ వారం రోజుల పాటు తనవద్దే ఉండాలని ఆ బాలుడి తల్లిదండ్రులని నమ్మించింది. అనంతరం ఆ 7 రోజులపాటు విద్యార్థిని టీచర్ తన ఇంట్లో పెట్టుకొని పెళ్లి వేడుకలు నిర్వహించారు. పెళ్లి తర్వాత ఆ యువతి తన గాజులు పగలగొట్టి తనకు తాను వితంతువుగా మారిపోయి బాలుడిని ఇంటికి పంపించేసింది.
అయితే వారం రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న బాలుడు ఏం జరిగిందో తన తల్లిదండ్రులకి పూస గుచ్చినట్టుగా చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. దీనితో బాలుడి కుటుంబ సభ్యులు బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు.. అయితే మహిళ ఒత్తిడి మేరకు బాధితుడి కుటుంబం ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.