US: రద్దీ రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. 19 ఏళ్ల యువ పైలట్ సాహసం

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Update: 2026-03-11 07:45 GMT

అమెరికాలో 19 ఏళ్ల యువ పైలట్ అత్యవసర సమయంలో రద్దీ రోడ్డుపై విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. చాలా చక్కగా సాహసం చేసి సురక్షితంగా కిందకు దించాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యువ పైలట్ నడుపుతున్న విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తింది. విమానంలో పవర్ ఆగిపోయింది. విమానంలో పైలట్ నికో బ్రే తన స్నేహితుడితో పామ్ బీచ్ కౌంటీకు వెళ్తున్నారు. అయితే విమానంలో సమస్య తలెత్తడంతో జూపిటర్‌లోని ఇండియాటౌన్ రోడ్డులో చాకచక్యంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పైలట్ నికో బ్రే చాలా తెలివిగా అనుకూలమైన ప్రదేశంగా రోడ్డును ఎంపిక చేసుకుని ల్యాండింగ్ చేయడం ప్రశంసించబడుతున్నాడు. నికో బ్రే జనవరి 2025లో పైలట్ లైసెన్స్‌ను పొందాడు. ప్రస్తుతం విమాన శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.

Tags:    

Similar News