Saudi Arabia: బ్రిడ్జిని ఢీకొన్న బస్సు.. 20 మంది యాత్రికులు మృతి

Saudi Arabia: సౌదీ అరేబియాకు నైరుతి దిశలో సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ఉమ్రా యాత్రికులు మరణించారు. 29 మంది గాయపడ్డారు.

Update: 2023-03-28 05:50 GMT

Saudi Arabia: సౌదీ అరేబియాకు నైరుతి దిశలో సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ఉమ్రా యాత్రికులు మరణించారు. 29 మంది గాయపడ్డారు. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అసిర్ ప్రావిన్స్, అభా నగరాన్ని కలిపే రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని గల్ఫ్ న్యూస్ నివేదించింది. బాధితులు ఉమ్రా నిర్వహించేందుకు మక్కా వెళుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. రెడ్ క్రెసెంట్ అథారిటీ, సౌదీ సివిల్ డిఫెన్స్‌కు చెందిన బృందాలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని తమ సేవలు అందిస్తున్నాయి.

బస్సులో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్నారని, ప్రమాదానికి కారణం కారులో ఇబ్బంది లేదా బ్రేకులలో సమస్య అని భావిస్తున్నారు. వాహనం బ్రిడ్జిని ఢీకొని బోల్తా పడి మంటలు చెలరేగాయి. హజ్ సీజన్‌లో రోడ్లపై భారీ ట్రాఫిక్‌ నెలకొంటుంది.  2019లో మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 35 మంది విదేశీయులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. 

Tags:    

Similar News