అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతగా దీన్ని గుర్తించారు. దీంతో యూఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నాం 12.37 గంటలకు ఇది చోటుచేసుకుంది.
20.కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్యాండ్ పాయింట్ సిటీకి 87 కి.మీ దూరంలో దీని ఎపీసెంటర్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్‌సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట అనంతరం హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 ఈ ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారత్‌లోని హరియాణాలోనూ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 3.3 తీవ్రతగా ఇది ఉంది.