అర్ధరాత్రి వేళ అఫ్గానిస్థాన్‌పై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. పాక్టికా ప్రావిన్స్‌లోని బర్మాల్ జిల్లాలో, ఖోస్ట్ ప్రావిన్స్‌లోని సెపెరా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. రెండు చోట్ల జరిగిన దాడుల్లో 8 మంది దుర్మరణం చెందారు. సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాక్ ఈ దాడులకు పాల్పడిందని అఫ్గాన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు.
పాకిస్థాన్ వైమానిక దాడుల్లో పక్తికా ప్రావిన్స్‌లోని ఆరుగురు దుర్మరణం పాలయ్యారని, వారిలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారని ముజాహిద్ తెలిపారు. అదేవిధంగా ఖోస్ట్ ప్రావిన్స్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులతో కుప్పకూలిన భవన శిథిలాల కింద చిక్కుకుని మరో ఇద్దరు మహిళలు మరణించారని చెప్పారు. కాగా ఈ దాడులను ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ తీవ్రంగా ఖండించింది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ వైమానిక దాడులు జరిగాయి.