US NAVY: అమెరికా నేవీ చీఫ్‌గా మహిళ

అమెరికా నావికాదళ అధిపతిగా తొలిసారి మహిళ... అడ్మిరల్‌ లీసా ప్రాంచెటీని ప్రతిపాదించిన బైడెన్‌... సెనేట్‌ ఆమోదమే ఆలస్యం..

Update: 2023-07-25 05:30 GMT

అగ్రరాజ్యం అమెరికా మహిళా ఆఫీసర్ అడ్మిరల్‌( female admiral) లీసా ఫ్రాంచెటీ(Lisa Franchetti )ని అమెరికా నేవీ‍( US Navy) అధిపతిగా ఎంపిక చేస్తూ.. అధ్యక్షుడు బైడెన్‌(US President Biden) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సెనేట్ బైడెన్ ప్రతిపాదనను ఆమోదిస్తే అమెరికా నావికా దళాధిపతి( female admiral to lead the US Navy) బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మహిళగా( first time a woman) అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి చరిత్ర సృష్టించనున్నారు. అమెరికా మిలటరీ సర్వీస్ చీఫ్‌గా ఓ మహిళ నియమితులు కావడం అమెరికా చరిత్రలో తొలిసారి అవుతుంది. ప్రస్తుతం లీసా.. అమెరికా నావికా దళానికి( US naval forces) వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికా నౌకాదళంలో ఫోర్ స్టార్ అడ్మిరల్ గా నియమితురాలైన రెండో అధికారిగా అమె ఖ్యాతి గడించారు.


లీసా ఫ్రాంచెట్టి గత 38 సంవత్సరాలుగా స్వీకరించిన ప్రతి పదవికి తగిన న్యాయం చేశారని బైడెన్ ఈ సందర్భంగా కొనియాడారు. అమెరికా నావికా దళానికి అత్యుత్తమ సేవలందించారని గుర్తుచేశారు. రిపబ్లికన్లకు అమెరికా నౌకా దళం పేరు ప్రఖ్యాతలు గురించి, దాని సామర్ధ్యం గురించి పరిజ్ఞానం ఉందనే అనుకుంటున్నట్లు బైడెన్ తెలిపారు. అయితే దేశఖ్యాతిని మరింతగా పెంచే విధంగా తొలి మహిళా అడ్మిరల్ నిర్ణయాన్ని వారు ఆమోదిస్తారని బైడెన్ తెలిపారు.

జాయింట్ చీఫ్స్ ఆఫ్ చీఫ్‌ హోదాకు చేరిన తొలి అమెరికన్‌ మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందుతారు. ఆమె కెరీర్ మొత్తంలో, అడ్మిరల్ ఫ్రాంచెట్టి కార్యాచరణ, విధాన రంగాలలో విస్తృతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యునైటెడ్ స్టేట్స్ నేవీలో ఫోర్-స్టార్ అడ్మిరల్ ర్యాంక్ సాధించిన రెండో మహిళ నేవల్ ఆపరేషన్స్ చీఫ్‌, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో పనిచేసిన తొలి మహిళగా ఆమె మళ్లీ చరిత్ర సృష్టించనుంది.


ఇప్పటికే అమెరికా తీర రక్షక దళానికి మహిళ నాయకత్వం వహిస్తున్నారు. చీఫ్‌ అడ్మిరల్ లిండా ఫాగన్ ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఖ్యాతి గడించారు. కానీ లీసా ఫ్రాంచెటీ అంతకంటే పెద్ద పోస్టులో చేరనుండడం గమనార్హం. ప్రస్తుత చీఫ్‌ నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత లీసా ఆ పదవిని చేపట్టనున్నారు. అయితే సెనేట్‌ ఆమె ఎంపికను త్వరగా ద్రువీకరిస్తే మరింత త్వరగా ఆమె బాధ్యతలను చేపట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. 

Tags:    

Similar News