Gates' daughter Jennifer Marriage: ప్రపంచ కుబేరుడి కూతురి పెళ్లి ఖర్చు.. టూ సింపుల్..

Gates' daughter Jennifer Marriage: ప్రపంచ కుబేరుని కూతురు పెళ్లంటే అస్సలు తగ్గేదేలేదంటూ అంగరంగ వైభవంగా చేసేయరూ. కానీ బిల్‌గేట్స్‌కి ఆ అవకాశం దక్కలేదు.

Update: 2021-10-19 08:00 GMT

Gates' daughter Jennifer Marriage: మన హోదాని, దర్పాన్ని నలుగురికీ చూపించాలంటే పెళ్లికి మించిన పెద్ద వేడుక ఏముంటుంది. అందునా ప్రపంచ కుబేరుని కూతురు పెళ్లంటే అస్సలు తగ్గేదేలేదంటూ అంగరంగ వైభవంగా చేసేయరూ. కానీ బిల్‌గేట్స్‌కి ఆ అవకాశం దక్కలేదు. సింపుల్‌గా రూ.14 కోట్లతో కానిచ్చేశారు.

మన ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ తన గారాల పట్టి ఇషా అంబానీ వివాహన్ని 200 కోట్లు ఖర్చుపెట్టి చేసినట్లు సమాచారం. మరి ప్రపంచ కుబేరుడు ఇంకెంత ఖర్చు పెట్టాలి. కరోనా సీజన్ వారి వివాహ వేడుకల్ని కట్టడి చేసింది.

తక్కువ మంది అతిధులతో తక్కువ ఖర్చుతో కొద్ది రోజుల క్రితం బిల్ గేట్స్ కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహం జరిగింది. ఆమె స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్‌తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన పీపుల్ మేగజైన్ ధృవీకరించింది.

శనివారం మధ్యాహ్నం న్యూయార్క్‌ ఉత్తర సేలం కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌లో వివాహ వేడుక జరిగింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాజర్, జెన్నీఫర్ ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు గేట్స్ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గేట్స్ దంపతులు విడిపోవడంతో.. కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. గేట్స్ కూతురు వివాహానికి ఒక రోజు ముందు హాజరై పెళ్లి ఏర్పాట్లలో పాల్గొన్నారు.

Tags:    

Similar News