New york : న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడు అరెస్ట్
New york : ఇటీవల న్యూయార్క్ లో జరిగిన కాల్పుల ఘటనలో 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు.;
New york : ఇటీవల న్యూయార్క్ లో జరిగిన కాల్పుల ఘటనలో 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు న్యూయార్క్ పోలీసులు, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిందితుడి వేటాడి ఎట్టకేలకు పట్టుకున్నారు. జేమ్స్ మాన్‌హట్టన్ లోని ఈస్ట్ విలేజ్ పరిసరాల్లో దొరికాడు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50వేల డాలర్ల నజరాన ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సబ్‌వే రైల్వే స్టేషన్‌లో దుండగుడు గత మంగళవారం కాల్పులు జరిపాడు.. గ్యాస్ మాస్క్ పెట్టుకున్న నిందితుడు స్మోక్ గ్రెనేడ్ విసిరి కాల్పులకు తెగబడ్డాడు. బ్యారేజ్‌లోని 33 బుల్లెట్లు ఖాళీ అయ్యేంత వరకు బ్రూక్‌లైన్ సబ్‌వేలోని ప్రయాణికులపై ఫైరింగ్ జరిపాడు.ఈ ఘటనలో 10 మందికి బుల్లెట్ గాయాలవగా, మరో 13 మంది తొక్కిసలాటలో గాయపడ్డారు. జేమ్స్ చిత్రాలను సోషల్ మీడియాలో చూసిన ప్రేక్షకులు గమనించి పోలీసులను అప్రమత్తం చేయడంతో అతన్ని వెంటాడి మరి పట్టుకున్నారు పోలీసులు.