Canada: అమెరికాకు కరెంట్ కోతలు తప్పవని హెచ్చరిక
స్టార్ లింక్ డీల్ రద్దు చేసిన కెనెడా;
డొనాల్డ్ ట్రంప్ పాలనలో శత్రువులు, మిత్రులు అనే తేడా లేకుండా సుంకాల మోత మోగిస్తున్నారు. పొరుగుదేశం కెనడాపైనా 25 శాతం సుంకాలు విధించడంతో ఆ దేశం కూడా దీటుగా స్పందించింది. అమెరికాపై ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడాపై అమెరికా విధించిన సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కెనడా ఇంధన ఎగుమతులపై కూడా 10 శాతం టారిఫ్ సహా తమకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను కెనడా నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. తాము ఆర్థికంగా దెబ్బతింటుంటే చూస్తూ కూర్చోబోమని డగ్ ఫోర్డ్ స్పష్టం చేశారు.
కెనెడా పై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో కెనెడా ఇంధన ఎగుమతులపై 10 శాతం టారిఫ్ ఉంది. ఈ నిర్ణయాలు కెనెడా నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. తాము ఆర్థికంగా దెబ్బతింటున్నామని చూస్తూ కూర్చోబోమని డగ్ ఫోర్డ్ స్పష్టం చేశారు. ‘‘వారు ఒంటారియోను ధ్వంసం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోను. చిరునవ్వుతోనే చేయాల్సిందంతా చేస్తాను. కరెంట్ కోతలు విధిస్తాను. ఒంటారియోతో స్టార్లింక్ కు ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను. అది పూర్తయింది. ఆయన (ట్రంప్ ను ఉద్దేశించి) కెనెడా ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారు. మా స్టోర్ల నుంచి యుఎస్ ఆల్కహాల్ ను తొలగించాలని యోచిస్తున్నాం’’ అని ఫోర్డ్ వెల్లడించారు.
అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనెడా నుంచే వెళ్తున్నాయి. కెనెడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రోపవర్, సహజ వాయువు, ఎలక్ట్రిసిటీ పై యుఎస్ ఆధారపడింది. ‘‘వారు మా ఇంధనంపై ఆధారపడ్డారు. వాళ్లు కూడా నొప్పి భరించాలి’’ అని ఫోర్డ్ వ్యాఖ్యలు చేశారు. చిరకాల మిత్ర దేశంపై ట్రంప్ అసలు సుంకాలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ‘‘సన్నిహిత మిత్రులు, పొరుగువారిపై ఎందుకు దాడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కెనెడా పై సుంకం అంటే అమెరికన్ల పై పన్ను విధించడం కిందికే వస్తుంది’’ అన్నారు. ఇక, స్టార్లింక్ ఒప్పందం కింద తొలుత 15 వేల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ఇంటర్నెట్ సదుపాయం అందించాల్సి ఉంది.