Canada: మా నుంచే ఖలిస్థానీ గ్రూపులకు నిధులు.. అంగీకరించిన కెనడా

ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్న కెనడా..

Update: 2025-09-07 04:00 GMT

ఖలిస్తానీ ఉగ్రవాదులకు, వారి సంస్థలకు కెనడా ప్రభుత్వం ఎప్పటి నుంచో మద్దతుగా నిలుస్తుందో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో, ఖలిస్తానీ ఉగ్రవాదుల కోసం భారతదేశంతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా రిస్క్‌లో పెట్టాడు. అయితే, తొలిసారిగా, కెనడా నిజాన్ని ఒప్పుకుంది. ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపులు కెనడా నుంచి పనిచేస్తున్నాయని, ఆర్థిక సాయం పొందుతున్నాయని అంగీకరించింది. బబ్బర్ ఖల్సా, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్, సిక్స్ ఫర్ జస్టిస్ వంటి ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపులు కెనడా నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

కెనడాలో మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల ప్రమాదాలపై ఆ దేశ ఆర్థిక శాఖ అంచనా రిపోర్టులో దీనిని అంగీకరించింది. ‘‘ఖలిస్తానీ గ్రూపులు కెనడాతో సహా అనేక దేశాల్లో నిధులు సేకరిస్తున్నట్లు అనుమానిస్తున్నాము’’ అని తెలిపింది. హమాస్,హిజ్బుల్లా, ఖలిస్తానీ వంటి ఉగ్రవాద సంస్థలు కెనడా నుంచి ఆర్థిక సాయం పొందుతున్నట్లు నివేదిక పేర్కొంది. కెనడా నుంచి విస్తృతంగా నిధులు సేకరించే నెట్వర్క్‌ను కలిగి ఉన్నాయని పేర్కొంది. ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాహనాల దొంగతనాలకు ధార్మిక నిధులను ఖర్చు పెడుతున్నాయని తెలిపింది.

Tags:    

Similar News