సిక్ లీవ్ పెట్టి బీచ్‌లో ఎంజాయ్.. ఉద్యోగం ఊడబీకిన ఆఫీసర్

కర్ణుడి చావుకి కారణాలు అనేకం అని, ఆఫీసులో లీవ్ అడగాలంటే ఎన్ని వేషాలు వెయ్యాలి.;

Update: 2023-05-04 05:42 GMT

కర్ణుడి చావుకి కారణాలు అనేకం అని, ఆఫీసులో లీవ్ అడగాలంటే ఎన్ని వేషాలు వెయ్యాలి. అన్నిటికంటే ఆఫీసరు మనసు కరిగిపోయే చిన్న చిట్కా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పడం.. ఆలోచించకుండా లీవ్ గ్రాంట్ చేసేస్తారు. పాపం ఆ అబద్దమే అతడి కొంపముంచింది. సిక్ లీవ్ పెట్టి ఎంచక్కా ఫ్లైట్ ఎక్కి పర్యాటక ప్రదేశాలు వీక్షిద్దామనుకున్నాడు.. ఇంతలో కుళ్లుమోతు కొలీగ్ కంటపడ్డాడు.. అతడు ఆ విషయాన్ని ఆఫీసరు చెవిన వేశాడు.. అంతే మరో ఆలోచన లేకుండా ఉద్యోగం ఊష్టింగ్ అన్నాడు ఆఫీసర్.. సదరు వ్యక్తి లబోదిబోమని మొత్తుకుంటూ కోర్టుకెళ్లాడు.

అనారోగ్యంతో సెలవు తీసుకుని విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేశాడు చైనాకు చెందిన జు మౌమౌగా. అయితే, అప్పుడు అధిక పని ఒత్తిడి కారణంగా అతని ఉన్నత అధికారి దరఖాస్తును తిరస్కరించారు. సెలవు దొరకలేదు, ఏం చేయాలి చెప్మా అని దీర్ఘంగా ఆలోచించాడు. అప్పటికే ఊరికి వెళ్లడానికి ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేసుకున్నందున, 14 రోజుల సిక్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. లీవ్ లెటర్‌కి మెడికల్ సర్టిఫికేట్‌ను కూడా జత చేశాడు. అందులో అతనికి డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నాడు. ఈ ట్రిక్ బాగా పనిచేసింది. అతనికి ఆఫీసర్ సెలవులు ఇచ్చేశాడు. బతుకుజీవుడా అనుకుండా ఆఫీస్ నుంచి బయటపడి స్కూట్‌కేస్ సర్ధుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. 

ప్చ్.. బ్యాడ్‌లక్.. అతని సహోద్యోగులలో ఒకరు అతన్ని విమానాశ్రయంలో చూసి కంపెనీ యజమానికి సమాచారం అందించాడు. అది విన్న ఆఫీసర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.. వెంటనే అతడిని కంపెనీ నుండి తొలగించమని ఆర్డర్స్ పాస్ చేశాడు. జు తరువాత ఈ విషయంలో కేసు నమోదు చేశాడు. దీనిలో కోర్టు జును చట్టవిరుద్ధంగా తొలగించినందుకు 73 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కంపెనీని కోరింది. దాంతో, కంపెనీ హైకోర్టుకు వెళ్లింది. ఇది అతడిని కంపెనీ నుంచి తొలగింపును కొనసాగించాలని, రూ. 73 లక్షల పరిహారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News