చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఓ నియంత:బైడెన్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఓ నియంతగా బైడెన్ అభివర్ణించారు. చైనా బెలూన్‌ను పేల్చేసినప్పుడు జిన్‌పింగ్ బాగా కలత చెందారని ఎద్దేవా చేశారు. ఇలాంటి చర్యలు నియంతలకు చాలా ఇబ్బందికరమని బైడెన్.... జిన్‌పింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.;
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఓ నియంతచైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఘాటు విమర్శలు చేశారు. జిన్‌పింగ్‌ను ఓ నియంతగా బైడెన్ అభివర్ణించారు. అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో అగ్రరాజ్య విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ చైనాలో పర్యటిస్తున్నారు. బ్లింకెన్ జిన్‌పింగ్ ఇద్దరూ సమావేశమై ఒకరోజు కూడా గడవక ముందే బైడెన్ ఈ విమర్శలు చేశారు. అమెరికా గగనతలంలో గూఢచారి పరికరాలతో ఉన్న చైనా బెలూన్‌ను పేల్చేసినప్పుడు జిన్‌పింగ్ బాగా కలత చెందారని బైడెన్ ఎద్దేవా చేశారు. ఇలాంటి చర్యలు నియంతలకు చాలా ఇబ్బందికరమని బైడెన్.... జిన్‌పింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరిలో అమెరికా గగనతలంపై చైనా బెలూన్ ఎగరగా.. దానిని అగ్రరాజ్యం పేల్చేసింది. బెలూన్ పేలుడుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చైనాకు నిజంగానే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బైడెన్ అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ అమ్మకాల్లో చైనా వృద్ధి పడిపోయిందన్న అంచనాలు ఉన్నాయి. 2023లో ఈ నెల అమెరికా వృద్ధిని 1.1 శాతంగా అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్... ఇది చైనా కంటే 0.5 శాతం ఎక్కువని తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ.. దీని వల్ల ఎలాంటి పురోగతి లేదని నిపుణులు అంటున్నారు. చైనా-అమెరికా దేశాల మధ్య సంబంధాలు సరైన మార్గంలో ఉన్నాయని.. బ్లింకెన్ పర్యటనలో ఇది మరింత పురోగతి సాధించిందని బైడెన్ అన్నారు.