ఘనంగా మొదలైన క్రిస్మస్ వేడుకలు.. క్రీస్తు స్మరణలతో మార్మోగుతున్న చర్చిలు

christmas celebrations 2020 : ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు(christmas 2020) ఘనంగా మొదలయ్యాయి. క్రీస్తు స్మరణలతో, ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో అధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది.

Update: 2020-12-25 04:45 GMT

christmas celebrations 2020 : ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు(christmas 2020) ఘనంగా మొదలయ్యాయి. క్రీస్తు స్మరణలతో, ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో అధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. ప్రముఖ వాటికన్ సిటీ (Vatican City)చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. సెయింట్‌ పీటర్స్‌ బసిలికా చర్చిలో క్రిస్మస్ నైట్ నిర్వహించారు. బాల యేసు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి తల్లి పొత్తళ్లలోకి చేర్చారు. క్రిస్మస్ వేడుక సందర్భంగా వాటికన్ చర్చికి తరలివచ్చిన విదేశీయులకు పోప్ ప్రాన్సిస్ స్వాగతం పలికారు.

అనంతరం క్రీస్తు పుట్టుకకు సంబంధించిన కథలను పోప్ చదివి వినిపించారు. ప్రపంచంలోనే అతి పెద్ద చర్చి అయిన వాటికన్ సిటిలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన క్రిస్మస్ వేడుకులు వేాలాది మంది క్రైస్తవులు హాజరయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అటు జీసస్‌ జన్మస్థలంగా భావించే బెత్లెహాంలో కూడా క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు.

Tags:    

Similar News