Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా.. నిషేధించిన చైనా
Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌పై చైనా జనవరి 26 వరకు నిషేధాన్ని విధించింది.;
Dragon Fruit: వియత్నాం నుండి దిగుమతి చేసుకున్న పండ్లలో కరోనావైరస్ జాడలు కనిపించడంతో చైనా అధికారులు అనేక సూపర్ మార్కెట్లను లాక్ చేశారు. జియాంగ్జీ ప్రావిన్సులలోని కనీసం తొమ్మిది నగరాలు వియత్నాం నుండి దిగుమతి చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనావైరస్ జాడలు కనుగొన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అధికారులు దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తుల అత్యవసర స్క్రీనింగ్‌ను ప్రారంభించారు. ఆహారం నుండి కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ దేశంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చైనా ఆరోగ్య అధికారులు జాగ్రత్తగా ఉన్నారు.
డిసెంబర్ చివరి వారంలో COVID-19 జాడలు కనుగొనబడినందున వియత్నాం నుండి దిగుమతి చేసుకునే డ్రాగన్ ఫ్రూట్‌పై చైనా జనవరి 26 వరకు నిషేధాన్ని విధించింది. వైరస్‌ను ఎదుర్కొంటూనే చైనా వచ్చే నెలలో వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించనుంది.
జియాన్ నగరంలో కరోనా కేసులు ఎక్కువవడంతో అక్కడ లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. షాపింగ్ మాల్స్ సహా ఇతర కమ్యూనిటీ ప్రాంతాలకు ప్రజలను వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. నగరంలో గత నెలలో 1600 కంటే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదైనట్లు నివేదికలు వచ్చాయి.