Cyclone Chido: ఫ్రాన్స్‌ను గడగడలాడించిన చిడో తుపాన్

లెక్క లేనంతమంది మృతి.. క్షతగాత్రులు కూడా వేలల్లోనే;

Update: 2024-12-16 05:30 GMT

హిందూ మహాసముద్ర ద్వీప సమూహంలోని మయోట్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన తుపాను ‘చిడో’ వేలాదిమంది ప్రాణాలు బలిగొంది. గత శతాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలమైన తుపాను అని ఫ్రెంచ్ అధికారులు చెబుతున్నారు. తనకు తెలిసినంత వరకు ఈ తుపాను కారణంగా కొన్ని వేలమంది మృతి చెంది ఉంటారని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులు కూడా వేలల్లో ఉండొచ్చని తెలిపారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మృతుల సంఖ్యను కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని ఫ్రెంచ్ అంతర్గతశాఖ మంత్రి పేర్కొన్నారు. చిడో తుపాను రాత్రికి రాత్రే మయోట్‌ను తాకినట్టు చెప్పారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నట్టు వివరించారు. గత 100 ఏళ్లలో ఇంత బలమైన తుపాను ద్వీపాన్ని ఎన్నడూ తాకలేదని స్థానిక వాతావరణశాఖ తెలిపింది.

నిజం చెప్పాలంటే తాము విషాదాన్ని అనుభవిస్తున్నామని, అణుయుద్ధం తర్వాత ఉండే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని మయోట్ రాజధాని మమౌద్జౌ నివాసి ఒకరు తెలిపారు. తమ పొరుగు ప్రాంతం మొత్తం అదృశ్యమైందని చెప్పుకొచ్చారు. వేలాది గృహాలు శిథిలమైన ఏరియల్ వ్యూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

 శనివారం తుఫాను కారణంగా మయోట్‌ ద్వీపం పూర్తిగా దెబ్బ తిన్నదని, జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంతనేది అంచనా వేయడం కష్టంగా ఉందన్నారు. ఫ్రాన్స్ రెస్క్యూ టీమ్‌లు.. మెడిసిన్‌, ఆహారంతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల్ని ద్వీపానికి తరలించినట్లు మయోట్‌ ద్వీప ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. 

Tags:    

Similar News