Texas: టెక్సాస్‌లో ఆకస్మిక వరదలు.. 24 మంది మృతి..

23 మంది చిన్నారులు గల్లంతు;

Update: 2025-07-05 03:30 GMT

అగ్ర రాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. టెక్సాస్ హిల్ కంట్రీలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలు కారణంగా 24 మంది మృతి చెందగా.. సమ్మర్ క్యాంప్ నుంచి 23 మంది పిల్లలు గల్లంతయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

టెక్సాస్ హిల్ కంట్రీలో నెలల పాటు కురిసే వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసేసింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. అయితే అదే ప్రాంతంలో చిన్నారులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. హఠత్తుగా వరదలు సంభవించడంతో దాదాపు 23 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పడవ, హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తల్లిదండ్రులు తమ బిడ్డల జాడ తెలిస్తే.. తెలియజేయాలని వేడుకుంటున్నారు.

ఇక రెస్క్యూ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 6 నుంచి 10 మృతదేహాలు లభ్యమయ్యాయని లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ తెలిపారు. తప్పిపోయిన బాలికల మృతదేహాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. గ్వాడాలుపే నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో వరదలు ఉధృతం అయ్యాయి. క్షణాల్లోనే వరదలు ముంచెత్తినట్లుగా సమాచారం. కనీసం తప్పించుకునే మార్గం లేక చాలా మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నీళ్లు ఇంకిపోయాక.. ఎంత మంది చనిపోయారనేది తెలియనుంది.

Tags:    

Similar News