Sexual Assault on Patients: 50 మంది రోగులపై అత్యాచారం... ఆపై...

50 మంది రోగులపై అత్యాచారం చేశాడని ఆరోపణలు... మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన క్రూరుడు...;

Update: 2023-08-10 04:30 GMT

వైద్యుడు దేవుడితో సమానం అంటారు. కానీ అమెరికాలోని ఈ వైద్యుడు మాత్రం రాక్షసుడిలా ప్రవర్తించాడు. సభ్య సమాజం తల దించుకునేలా చేశాడు. తన వద్దకు వైద్యం కోసం వచ్చే మహిళలను, బాలికలపై లైంగిక దాడి(Drugging and Assaulting Patients) చేశాడు. వారికి మత్తు మందు ఇచ్చి పైశాచికంగా ప్రవర్తించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు 50 మంది సబలలపై ఈ క్రూరుడు అత్యాచారాలు చేశాడు. ఆ దారుణాన్ని వీడియో రికార్డింగ్‌(dozens of videos) చేశాడు. వెలుగులోకి వస్తున్న అతని దారుణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కేసును విచారణ చేస్తున్న పోలీసులకు కూడా షాక్‌ కొట్టేలా నివ్వెరపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.

అమెరికా న్యూయార్క్‌లోని ప్రెస్బిటేరియన్ క్వీన్స్ ఆస్పత్రి( New York hospital)లో 33 ఏళ్ల జి అలాన్‌ చెంగ్‌ అనే డాక్టర్‌‍(Queens Doctor) గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ప్రాణాలు రక్షించాల్సిన ఈ దుర్మార్గుడు... తన వద్ద చికిత్సకు వచ్చే మహిళలపై కన్నేసేవాడు. వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం( raped and sexually abused women) చేసి దానిని రికార్డు చేసేవాడు. అతని మాజీ ప్రియురాలు ఒకరు చెంగ్‌ తనపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెంగ్ తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని, అతని ఫోన్‌లో తనవి, తన లాంటి ఎందరో మహిళల అత్యాచార వీడియోలు ఉన్నాయని పోలీసులకు తెలిపింది. చెంగ్‌ మాజీ ప్రియురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో పోలీసులకే దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.


పోలీసులు చెంగ్‌ ఇంటిపై దాడి చేశారు. అక్కడ మత్తునిచ్చే ఔషధాలు సహా డజన్ల కొద్దీ వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. చెంగ్‌ బాధితులందరూ 19 నుంచి 47 ఏళ్ల మధ్య వయస్సు గల స్త్రీలను పోలీసులు తెలిపారు. వీరందరిపై అతడు పనిచేసిన ఆస్పత్రిలోనే లైంగిక దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. చెంగ్ ఆరుగురు మహిళలపై లైంగిక దాడి చేసినట్లు ప్రధానంగా అభియోగాలు మోపారు. ఇంతటి భయంకరమైన వ్యక్తిని చూడలేదని,, ఇతనో సీరియల్ రేపిస్ట్ అని పోలీసులు తెలిపారు.

చెంగ్‌తనకు తనకు మత్తుమందు ఇచ్చి, ఆసుపత్రి పరీక్ష గదిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 19 ఏళ్ల యువతి ఆరోపించింది. తనకు స్పృహ కోల్పోయే ఇంజక్షన్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని... తాను మేల్కొన్నప్పుడు డాక్టర్ గదిలో లేడని ఆ యువతి పోలీసులకు తెలిపింది. న్యూయార్క్‌తో పాటు చాలా నగరాల్లో చెంగ్ ఈ లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు.

బాధితుల ఆరోపణలతో చెంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెంగ్‌ బాధితులు బయటకు వచ్చి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు పిలుపునిచ్చారు. వీడియోల్లో చాలామంది బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని, ఎవరైనా తెలిసి ఉంటే క్వీన్ డిస్ట్రిక్ట్ అటార్నీ స్పెషల్ బాధితుల బ్యూరోని సంప్రదించాలని సూచించారు. ఈ ఆరోపణలు నిజమైతే చెంగ్‌కు 25 ఏళ్లు కానీ లేదా జీవిత ఖైదు శిక్షగాని పడుతుంది. ఈ క్రూరుడిని ఇప్పటికే ఆస్పత్రి విధుల నుంచి తప్పించారు.

Tags:    

Similar News