Thailand-Cambodia Conflict: థాయ్‌ల్యాండ్- కంబోడియా మధ్య యుద్ధాన్నీ ఆపేశా: డొనాల్డ్ ట్రంప్
థాయ్‌ల్యాండ్- కంబోడియా మధ్య హైటెన్షన్ వాతావరణం..;
థాయ్‌ల్యాండ్- కంబోడియా మధ్య హైటెన్షన్ వాతావరణం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగ ప్రవేశం చేశారు. మరోసారి శాంతి దూతగా మారారు. తన మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధాన్ని విరమింపజేస్తున్నట్లు ప్రకటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పలబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు ఒప్పుకున్నాయని ప్రకటించారు.
అయితే, కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్‌లతో మాట్లాడినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని సోషల్ మీడియాలో ట్రంప్ రాసుకొచ్చారు. వారు వెంటనే సమావేశమై చర్చలు జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అయితే, ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయనే వివరాలను మాత్రం తెలియజేయలేదు.
కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా ఒకే చేసినట్లు థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫేస్‌బుక్ వేదికగా తెలిపారు. అయితే, కంబోడియా మాత్రం నిజాయితీగా వ్యవరించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే యూఎస్ తో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకు హెచ్చరించారు. ఇక, ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు నిలిచాయని ఇప్పటి వరకు అనేక మార్లు చెప్పుకొచ్చారు.
మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని ప్రతిపాదించింది. ఘర్షణలను నిలిపివేసి సంయమనం పాటించాలని, వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఐరాస దౌత్యవేత్త ఒకరు కోరారు. తమపై ముందుగా కంబోడియా దాడి చేసినట్లు థాయ్‌లాండ్ చేస్తున్న ఆరోపణలపై సమితిలోని కంబోడియా రాయబారి చియా కేవ్ స్పందిస్తూ తమ కన్నా మూడు రెట్ల పెద్ద సైన్యం, వైశాల్యం ఉన్న దేశంపై వైమానిక దళమే లేని ఓ చిన్న దేశం ఎలా దాడి చేయగలదని ప్రశ్నించారు.